Sunday, November 13, 2011

Forewords

శ్రీ గురుభ్యోన్నమః 



అజ్ఞానాంద  తమస్సూర్యం దివ్య జ్ఞానైక  దీదితం !
అక్షరజ్ఞాన సిధ్యర్థం ప్రణమామి గురుం శివం !!

ముందుగా ఒక మాట చెప్పుకోవాలి, జ్యోతిష్యమంటే ఏదో ఊహించి చెప్పే శాస్త్రం కాదు. ఇది ఖగోళ శాస్త్రంతో కూడుకున్న సిద్దాంతము. సైంటిఫిక్ గా ఉండే గ్రహ గతులే ఇందులోనూ ఉంటాయి, నక్షత్రాలు, గ్రహాలూ, వాటి రూపు రేఖలు, గమనాలు, గతులు లెక్కించి చెప్పేదే జ్యోతిష్య శాస్త్రము. సరిగ్గా లెక్కలు వేసి చెప్పే వారికి పూర్తి సరైన భూత-వర్త-భవిష్య విషయాలు తెలుస్తాయి. అది చెప్పేవారి సామర్థ్యాన్ని బట్టే ఉంటుందని గమనించాలి. అదీ కాకుండా సరైన జనన వివరాలు తెలిసి ఉండడం ప్రధానం.

Easy Astrology అంటే అరటి పండు ఒలచి నోట్లో పెట్టినట్టు, సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా సామాన్య భాషలో రాయటం జరుగుతుంది. కొన్నిపురాతన గ్రంథాల విషయాలను యథాతథంగా పెట్టటమూ జరుగుతుంది. జ్యోతిష్యంలో కూడా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో సిద్దాంతాలు ఉన్నాయి,  నా అనుభవంలో ఫలితాలిచ్చిన శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ రాయటం జరుగుతుందని మనవి. 




No comments:

Post a Comment