MARRRIAGE - RAKSHASA GANA CANCELLATION NAKSHATRAS
వివాహము విషయమున - పనికివచ్చు రాక్షస గణములు
ఆశ్రేష, చిత్త, విశాఖ, మూల, శతభిషము అను 5 నక్షత్రములు స్త్రీలకు రాక్షస గణములుగా ఉన్న యెడల అవి దోషకారి కావు. అనగా ఈ నక్షత్రాలకు పూర్తి గణ పాయింట్స్ 6 ఇవ్వదగునని పెద్దలు చెప్పి ఉన్నారు.
ఉదా: అమ్మాయి శతభిషము రాక్షస గనణము - అబ్బాయి పుష్యమి దేవ గణము, వీరికి గుణమేళన పట్టిక ప్రకారము 1 పాయింటు వచ్చును. కాని శతభిషము నక్షత్రము స్త్రీలకు దోషకారి కాని నక్షత్రముగా తెలుపబడిన ప్రకారము పూర్తి 6 పాయింట్స్ ఇవ్వ వలెను.
ఈ 5 (ఆశ్రేష, చిత్త, విశాఖ, మూల, శతభిషము) నక్షత్ర స్త్రీలకు రాక్షసగణ దోషము వర్తించదు అని తెలియవలెను.
Note: అమ్మాయి, అబ్బాయి రాశ్యాధిపతులు మిత్రులై ఉన్నచో కూడా గణదోషము పరిగణించదగదు.